Skip to main content

అంగారక గ్రహంపై ఉప్పు నీటి సరస్సులు

దాదాపు 300 కోట్ల సంవత్సరాల క్రితం అంగారక (మార్స్) గ్రహంపై ఉప్పు నీటి సరస్సులు ఉండేవని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
మార్స్ గ్రహంపై ఉన్న వాతావరణం కారణంగా అవి ఎండిపోయాయని తెలింది. పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. 300 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్‌పై ఉన్న గేల్ క్రేటర్ ప్రాంతంలోని సరస్సు ఏర్పడింది. 95 మైళ్ల వెడల్పు గల రాతి పరివాహకంగా ఇది ఏర్పడింది. 2012 నుంచి నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌తో అన్వేషణ జరుగుతోందని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంగారక గ్రహంపై ఉప్పు నీటి సరస్సులు
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు
Published date : 21 Oct 2019 05:21PM

Photo Stories