ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.1,510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్ హార్బర్లకు, తొలి దశలో 25 ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన జరిగింది.
ప్రపంచ మత్స్యకార దినోత్సవం(నవంబర్ 21) సందర్భంగా నవంబర్ 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయం కోసం రూ.3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు ప్రకటించారు.
తాజాగా శంకుస్థాపన జరిగిన నాలుగు ఫిషింగ్ హార్బర్లు...
- నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె
- తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ
- గుంటూరు జిల్లా నిజాంపట్నం
- కృష్ణా జిల్లా మచిలీపట్నం
త్వరలో ఏర్పాటు కానున్న మరో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు...
- శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం
- విశాఖ జిల్లా పూడిమడక
- పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప
- ప్రకాశం కొత్తపట్నం
Published date : 23 Nov 2020 05:48PM