Skip to main content

ఆంధ్రప్రదేశ్‌కు రెండు పోలీస్ శౌర్య పతకాలు

దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది.
Current Affairs వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పోలీస్ శౌర్య పతకాలు, ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకంతో పాటు 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఏఏసీ ర్యాంకు అధికారి గొంగటి గిరీష్ కుమార్, జేసీ ర్యాంకు అధికారి కూడుపూడి హరికృష్ణకు పోలీసు శౌర్య పతకాలు వచ్చాయి. విజయవాడ ఏసీబీ అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాథుర్తి శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకం దక్కింది.

తెలంగాణకు...
తెలంగాణ రాష్ట్రానికి రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్, నిజామాబాద్ ఐజీ శివశంకర్‌రెడ్డి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను దక్కించుకున్నారు.
Published date : 26 Jan 2021 07:46PM

Photo Stories