Skip to main content

ఆంధ్రప్రదేశ్‌కు ఐసీఏఆర్‌ జాతీయ అవార్డు

అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు 2020వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది.
Current Affairs
తమిళనాడు తిరుచిరాపల్లిలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్‌) అనుబంధ అరటి పరిశోధన కేంద్రంలో ఆగస్టు 21న నిర్వహించిన కిసాన్‌ మేళాలో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఐదేళ్ల కిందట 79 వేల హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.05 లక్షల హెక్టార్లకు చేరిందని వివరించారు. మధ్య తూర్పు దేశాలైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఆంధ్రప్రదేశ్‌ అరటి పండ్లపై ఆసక్తి చూపడంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీఏఆర్‌ జాతీయ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌
ఎక్కడ :ఐసీఏఆర్అనుబంధ అరటి పరిశోధన కేంద్రం, తిరుచిరాపల్లి, తమిళనాడు
ఎందుకు :అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించినందుకు
Published date : 25 Aug 2020 04:56PM

Photo Stories