ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి కమతం కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 5న హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన కమతం 1937 నవంబర్ 1న జన్మించారు. మహబూబ్‌నగర్‌లో డిగ్రీ, ఉస్మానియా లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.
1967 ఎన్నికల్లో మొదటిసారి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిగి నియోజకవర్గం(ప్రస్తుతం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా) నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా కమతం రాంరెడ్డి గెలుపొందారు. 1967 ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972, 1989లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1980లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి, అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు.
మంత్రిగా...
1977లో వెంగళ్‌రావు కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కమతం పనిచేశారు. అలాగే 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రిగా, 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.