అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ వాయిదా
Sakshi Education
కరోనా ధాటికి మరో మెగా ఈవెంట్ వాయిదా పడింది. భారత్ వేదికగా జరగాల్సిన అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఏప్రిల్ 4న ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్‌లకు కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై నగరాలు ఆతిథ్యమివ్సాల్సింది. మొత్తం 16 జట్లు తలపడే టోర్నీలో... ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత పొందింది. అండర్–17 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనడం భారత్‌కిదే తొలిసారి కావడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా)
ఎక్కడ : భారత్
ఎందుకు : కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో
ప్రాణాంతక వైరస్ కారణంగానే 2020, నవంబర్ 2 నుంచి 21 వరకు జరగాల్సిన ప్రపంచకప్ టోర్నీని నిలిపివేస్తున్నామని ‘ఫిఫా కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్’ వెల్లడించింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ‘ఫిఫా’ నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) స్వాగతించింది.
షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్‌లకు కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై నగరాలు ఆతిథ్యమివ్సాల్సింది. మొత్తం 16 జట్లు తలపడే టోర్నీలో... ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత పొందింది. అండర్–17 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనడం భారత్‌కిదే తొలిసారి కావడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా)
ఎక్కడ : భారత్
ఎందుకు : కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో
Published date : 06 Apr 2020 06:29PM