అమరులు వారు పుస్తకావిష్కరణ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా అక్టోబర్ 21న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటివారైనా మినహాయింపు వుండకూడదని చెప్పారు. పోలీసులు, హోంగార్డులు ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురైతే రూ.30 లక్షలు, ఉగ్రవాద హింసలో మరణిస్తే రూ.40 లక్షల బీమా అందించేలా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చామని సీఎం ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమరులు వారు పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమరులు వారు పుస్తకావిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Published date : 22 Oct 2019 05:31PM