అమ్మఒడి పథకం రెండో విడత ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం కింద రెండో ఏడాది నగదు జమ కార్యక్రమం ప్రారంభమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణం, నెల్లూరు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు
నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో జనవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
పథకం-ముఖ్యాంశాలు
- అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు.
- అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.
- 2020, జనవరి 9న చిత్తూరులో తొలిసారిగా ఈ పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు
- 2022 ఏడాది నుంచి అమ్మ ఒడి కింద నగదుకు బదులుగా తల్లులు కోరుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇస్తాం. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు దీన్ని వర్తింపచేస్తాం.
- 42.33 లక్షల మంది పేద తల్లులకు 2020 ఏడాది రూ.6,400 కోట్లు ఇచ్చాం. 2021 సంవత్సరం 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,673 కోట్లు అమ్మఒడి కింద ఇస్తున్నాం.
- 2020 ఏడాది అమ్మఒడి కింద 82 లక్షల మంది పిల్లలకు లాభం కలిగితే ఈ ఏడాది 84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది.
- ప్రభుత్వ స్కూళ్లలో గతంలో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 42 లక్షల మంది ఉన్నారు.
- పిల్లలు, మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో టాయిలెట్లను నిర్మించడమే కాకుండా నిర్వహణ కోసం అమ్మ ఒడిలో ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 మినహాయిస్తున్నాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణం, నెల్లూరు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు
Published date : 12 Jan 2021 05:50PM