అమల్లోకి లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనం
Sakshi Education
ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) నవంబర్ 27 నుంచి కొత్తగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాగా (డీబీఐఎల్) మారింది. దీంతో దాదాపు శతాబ్దకాలం చరిత్ర గల బ్యాంక్ కనుమరుగైనట్లయింది.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎల్‌వీబీని గట్టెక్కించేందుకు డీబీఐఎల్‌లో విలీనం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నవంబర్ 27 నుంచి ఈ విలీన నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ద్రవ్యలోటు ఆందోళన...
ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు- పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. వార్షిక బడ్జెట్ నిర్దేశించిన లక్ష్యానికి మించి కొనసాగుతోంది. 2020 అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు 120 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నవంబర్ 27న విడుదల చేసిన గణాంకాలకు పరిశీలిస్తే...
- 2020-21లో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు ఉండాలని 2020, ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇది 2020-21 భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే 3.5 శాతం.
- 2020, ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికే ద్రవ్యోలోటు 120 శాతానికి అంటే రూ.9,53,154 కోట్లకు ఎగసింది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని దాటిపోవడం ఇది వరుసగా ఐదవనెల.
Published date : 28 Nov 2020 05:48PM