అమెరికాలో పురాతన వస్తువుల వేలం
Sakshi Education
భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు స్వర్ణాభరణాలు, కత్తులు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువులను అమెరికాలోని న్యూయార్క్‌లో వేలం వేశారు.
‘మహారాజులు, మొఘలుల వైభవం’ పేరిట క్రిస్టీస్ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. భారతీయ నగలు, కళాఖండాలు గతంలో ఎన్నడూ ఇంతటి భారీ ధరకు అమ్ముడుపోలేదని క్రిస్టీస్ పేర్కొంది. ఈ వేలం ద్వారా క్రిస్టీస్‌కు రూ.756 కోట్లు వచ్చాయి. భారత్ సహా 45 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొన్నారు. జైపూర్, ఇండోర్, బరోడా రాజవంశీకులకు చెందిన ఆభరణాలు, వస్తువులనూ ఈ వేలంలో పెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువుల వేలం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : క్రిస్టీస్ సంస్థ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువుల వేలం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : క్రిస్టీస్ సంస్థ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 21 Jun 2019 05:33PM