Skip to main content

అమెరికాలో భారతీయుడికి కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగంలో మరో భారత సంతతి అమెరికన్‌కు కీలక పదవి లభించనుంది.
ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు ప్రేమ్ పరమేశ్వరన్(50) ‘ఏషియన్-అమెరికన్‌‌స, పసిఫిక్ ఐలాండర్స్ అడ్వైజరీ కమిషన్’లో సభ్యుడిగా నియమించేందుకు ట్రంప్ అంగీకరించినట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తెలిపింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ పరమేశ్వరన్ ప్రస్తుతం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉత్తర అమెరికా విభాగం అధ్యక్షుడిగా, గ్రూప్ సీఎఫ్‌వోగా పనిచేస్తున్నారు. ఇండో-అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్థిరపడ్డ పసిఫిక్ ద్వీపవాసుల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వృద్ధిని మెరుగుపర్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సలహా కమిషన్‌ను తొలుత ఏర్పాటుచేశారు. ఇందులో వాణిజ్యం, ఆరోగ్యం, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి: ఏషియన్-అమెరికన్స్‌, పసిఫిక్ ఐలాండర్స్ అడ్వైజరీ కమిషన్’లో సభ్యుడిగా నియమాకం
ఎవరు: పేమ్ పరమేశ్వరన్
ఎక్కడ: అమెరికా
Published date : 19 Jan 2019 07:46PM

Photo Stories