Skip to main content

అమెరికాలో అత్యధిక ఆదాయం పొందుతున్న విదేశీయులు?

వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉంది.
Current Affairs

ఏటా అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తున్న అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో నమోదు చేస్తారు. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు.

సర్వే వివరాల ప్రకారం...
అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ల సగటు ఆదాయం ఏటా అందరికంటే ఎక్కువగా 1,00,500 డాలర్లుగా నమోదైంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలిచారు.

అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల సగటు ఆదాయం ఏటా..

స్థానం

దేశం

ఆదాయం(డాలర్లలో...)

1

ఇండియన్

1,00,500

2

ఫిలిప్పో

83,300

3

తైవానీస్

82,500

4

శ్రీలంకన్

74,600

5

జపనీస్

72,300

6

మలేసియన్

70,300

7

చైనీస్

69,100

8

పాకిస్తాన్

66,200

9

వైట్-అమెరికన్లు

59,900

10

కొరియన్

59,200

11

ఇండోనేసియన్

57,500

12

స్థానిక-అమెరికన్లు

56,200

13

థాయ్‌లాండ్

55,000

14

బంగ్లాదేశీ

50,000

15

నేపాలీ

43,500

16

లాటినో

43,000

17

ఆఫ్రికన్ -అమెరికన్లు

35,000


చదవండి: సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్‌‌సలో భారత్ ర్యాంకు ఎంత?

బ్యాచిలర్ డిగ్రీలోనూ...
అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారిలోనూ భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.

దేశం

శాతం

ఇండియన్ - అమెరికన్లు

70

కొరియన్ - అమెరికన్లు

53

చైనీస్ - అమెరికన్లు

51

ఫిలిప్పో - అమెరికన్లు

47

జపనీస్ - అమెరికన్లు

46

సగటు అమెరికన్లు

28


క్విక్ రివ్యూ :

ఏమిటి : అత్యధిక ఆదాయం పొందుతున్న విదేశీయులు
ఎప్పుడు :ఆగస్టు 30
ఎవరు : భారతీయలు
ఎక్కడ : అమెరికా
Published date : 02 Sep 2020 05:26PM

Photo Stories