Skip to main content

అమెరికా వీసాలపై తాత్కాలిక నిషేధం

అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Current Affairs
దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్‌ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు. అమెరికన్ల ఉద్యోగాల రక్షణ కోసం అధికారిక ఉత్తర్వులపైఏప్రిల్ 22న‌ సంతకం చేశానన్నారు. కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పలు మినహాయింపులు ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్‌ కార్డ్‌ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అమెరికా వీసాలపై తాత్కాలిక నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
ఎందుకు : కోవిడ్‌ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం
Published date : 24 Apr 2020 06:56PM

Photo Stories