Skip to main content

అమెరికా విచారణకు చైనా నిరాక‌ర‌ణ

కరోనా వైరస్‌ పుట్టుకపై విచారణకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది.
Current Affairsమేము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదని ఏప్రిల్ 20న తెలిపింది. కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది. ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్ స్పందిస్తూ.. ‘వైరస్‌ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు.

భారత్‌ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నేప‌థ్యంలో చైనా సహా పొరుగుదేశాలు 'ఆవకాశవాద టేకోవర్'లకు పాల్పడకుండా భారత్‌ కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న, లేదా భవిష్యత్తు ఎఫ్‌డీఐల (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విషయంలోనూ ఓనర్‌షిప్ బదిలీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
Published date : 21 Apr 2020 06:38PM

Photo Stories