Skip to main content

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు

అంచనాలకు అనుగుణంగానే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లను పావు శాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది.
దీంతో రిజర్వ్ వడ్డీ రేట్లు 2-2.25 శాతం నుంచి 1.75-2 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ 18న జరిగిన ఫెడ్ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత నిర్ణయానికి ఏడుగురు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫెడ్ రేట్లను తగ్గించడం ఈ ఏడాది రెండోసారి.
Published date : 19 Sep 2019 05:31PM

Photo Stories