అల్టిమేట్ టీటీ లీగ్ వాయిదా
Sakshi Education
కరోనా వైరస్ ఉధృతి కారణంగా... 2020, ఆగస్టు 14 నుంచి 31 వరకు జరగాల్సిన అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడింది.
భారత్‌లో ఇంకా ఎలాంటి టోర్నీల నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడం... మరోవైపు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) కూడా సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించకపోవడంతో లీగ్‌ను వాయిదా వేయక తప్పలేదని యూటీటీ ప్రమోటర్, భారత మాజీ టీటీ ప్లేయర్ కమలేశ్ మెహతా ఆగస్టు 11న తెలిపారు. 2017లో మొదలైన అల్టిమేట్ టీటీ లీగ్‌లో భారత్‌తోపాటు జర్మనీ, స్వీడన్, చైనీస్ తైపీ, హాంకాంగ్, పోర్చుగల్ దేశాల క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ టోర్నమెంట్ వాయిదా
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : యూటీటీ నిర్వాహకులు
ఎందుకు:కరోనా వైరస్ ఉధృతి కారణంగాక్విక్ రివ్యూ :
ఏమిటి : అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ టోర్నమెంట్ వాయిదా
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : యూటీటీ నిర్వాహకులు
Published date : 12 Aug 2020 05:43PM