Skip to main content

అల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్

టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు.
Current Affairsఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ డిసెంబర్ 4న లేఖ రాశారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ-వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని లేఖలో పేర్కొన్నారు.

అల్ఫాబెట్(గూగుల్) ప్రస్తుత మార్కెట్ విలువ : 89,300 కోట్ల డాలర్లు
ఆదాయం(2018) : 13,682 కోట్ల డాలర్లు
నికర లాభం : 3,074 కోట్ల డాలర్లు
సుందర్ పిచాయ్ 2018 సంపాదన (షేర్ల విలువతో కలిపి) : 47 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు)

మదురై టు సిలికాన్ వ్యాలీ...
తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్‌చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అల్ఫాబెట్ సీఈవోగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ) సుందర్ పిచాయ్
Published date : 05 Dec 2019 05:41PM

Photo Stories