అక్షయపాత్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ
Sakshi Education
అక్షయపాత్ర ఫౌండేషన్ 300 కోట్ల మందికి అన్నదానం చేసిన సందర్భంగా బృందావన్‌లోని చంద్రోదయ మందిర్ ఆవరణలో ఫిబ్రవరి 11న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... చిన్నారులు ఆరోగ్యంగా లేకుంటే శక్తివంతమైన నవ భారత నిర్మాణం సాధ్యం కాదని అన్నారు. అందుకే పోషకాహారం, టీకాలు, పారిశుధ్యం వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని వివరించారు. అంతర్జాతీయ కృష్ణ భక్తుల సంఘం(ఇస్కాన్) నిధులతో నడుస్తున్న అక్షయపాత్ర వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 14,702 పాఠశాలల్లో బాలలకు మధ్యాహ్నం భోజనం అందజేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్‌లో మథుర జిల్లాలోని బృందావన్‌లో అత్యంత ఆధునిక వంటశాల ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అక్షయపాత్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : బృందావన్, మథుర జిల్లా, ఉత్తరప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అక్షయపాత్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : బృందావన్, మథుర జిల్లా, ఉత్తరప్రదేశ్
Published date : 12 Feb 2019 04:55PM