ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
Sakshi Education
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్‌కు చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా ఉన్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్ మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్ 2020, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. చంద్రదత్తా కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్‌తోపాటు, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, విధానాలు పాటిస్తున్నదీ లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తుంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : చంద్ర దత్తా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : చంద్ర దత్తా
Published date : 29 Apr 2020 08:20PM