అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతం?
Sakshi Education
ఇరుగు పొరుగు దేశాలైన అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నారుు. రష్యా చొరవతో ఇరు దేశాల మధ్య వివాదాస్పద నగొర్నొ-కరబక్ ప్రాంతంలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల వ్యవధిలోనే ఉల్లంఘనకు గురైంది.
ఆర్మేనియా సైనిక దళాలు తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడ్డాయని అజర్‌బైజాన్ అక్టోబర్ 11న ఆరోపించింది. తమ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది పౌరులు మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని, ఒక నివాస భవనం ధ్వంసమైందని వెల్లడించింది. మింగచెవిర్ నగరంలోనూ క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది.
శతాబ్దాలుగా వివాదం...
నగొర్నో-కరాబాఖ్ అనే ప్రాంతంపై పట్టుకోసం అజర్‌బైజాన్, ఆర్మేనియా కత్తులు దూసుకుంటున్నారుు. శతాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్‌బైజాన్‌లో ఉన్నప్పటికీ.. దానిపై ఆర్మేనియా ఆధిపత్యం వహిస్తోంది. ఇరుదేశాల మధ్య 2020, సెప్టెంబర్‌లో ఆరంభమైన ఘర్షణతో 400కుపైగా మరణాలు సంభవించారుు.
చదవండి: అజర్‌బైజాన్, అర్మెనియా దేశాల రాజధానుల పేర్లు, కరెన్సీ వివరాలు

Published date : 12 Oct 2020 06:26PM