Skip to main content

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు తొలుత ఎక్కడ ప్రారంభమయ్యాయి?

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దండి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 రోజుల ‘దండి మార్చి’ఉత్సవాల ముగింపు సభలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
Current Affairs దండి మార్చ్‌ ఉత్సవంలో 25 రోజుల్లో 385 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన 81 మంది వలంటీర్లను ఉపరాష్ట్రపతి అభినందించారు. గుజరాత్‌లోని నవసరీ జిల్లా జలాల్‌పూర్‌ తాలూకాలో దండి గ్రామం ఉంది.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలు...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా... ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను మార్చి 12న తొలుత గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ సమీపంలోని సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2022 ఆగస్టు 15 వరకూ వేడుకలు కొనసాగుతాయి.
Published date : 07 Apr 2021 06:31PM

Photo Stories