ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లికి అగ్రస్థానం
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జనవరి 20న ప్రకటించిన పురుషుల క్రికెట్ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అగ్రస్థానం లభించింది.
ఈ ర్యాంకుల జాబితాలో బ్యాటింగ్ విభాగంలో కోహ్లి, రోహిత్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలవగా, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జనవరి 19న జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ కై వసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన టీమిండియా సారథి కోహ్లి 886 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ మూడో స్థానం దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్ వన్డే ర్యాంకుల్లో విరాట్ కోహ్లికి అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్ వన్డే ర్యాంకుల్లో విరాట్ కోహ్లికి అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
మాదిరి ప్రశ్నలు
1. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
1. గాంధీనగర్
2. గువాహటి
3. తిరువనంతపురం
4. చత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
Published date : 21 Jan 2020 06:20PM