ఐస్ గడ్డల మధ్య సుధీర్ఘకాలం గడిపిన వ్యక్తి?
Sakshi Education
ఆస్ట్రియాకు చెందిన స్విమ్మర్ జోసెఫ్ కోబెర్ల్ ఐస్ గడ్డల మధ్య సుధీర్ఘకాలం గడిపిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
సెప్టెంబర్ 5న ఆయన వియన్నా మెయిన్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా గాజు గదిలో ఉంచిన 200 కిలోల ఐస్‌క్యూబ్‌ల మధ్య ఒంటిపై కేవలం స్విమ్ సూట్ మాత్రమే ధరించి రెండు గంటల, 30 నిమిషాల, 57 సెకన్ల పాటు నిలబడ్డారు. అరగంట ఎక్కువ సమయం గడిపి 2019లో తను నెలకొల్పిన రికార్డును తాజాగా బద్దలుకొట్టారు. ప్రదర్శన తర్వాత జోసెఫ్‌కు వైద్యులు పరీక్షలు చేసి, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ధ్రువీకరించారు. 2021 ఏడాది లాస్‌ఏంజెలెస్‌లో ఇలాంటి ప్రయత్నమే చేసి, మరో రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు జోసెఫ్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐస్ గడ్డల మధ్య సుధీర్ఘకాలం గడిపిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : ఆస్ట్రియాకు చెందిన స్విమ్మర్ జోసెఫ్ కోబెర్ల్
ఎక్కడ : వియన్నా మెయిన్ రైల్వే స్టేషన్, ఆస్ట్రియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐస్ గడ్డల మధ్య సుధీర్ఘకాలం గడిపిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : ఆస్ట్రియాకు చెందిన స్విమ్మర్ జోసెఫ్ కోబెర్ల్
ఎక్కడ : వియన్నా మెయిన్ రైల్వే స్టేషన్, ఆస్ట్రియా
Published date : 07 Sep 2020 05:48PM