Skip to main content

ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా పొందేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్ తెలిపారు.
సైనిక, ఆర్థిక సామర్థ్యం సహా పరిమాణం, జనాభాపరంగా చూసి ఏదైనా దేశానికి శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాల్సి ఉంటే అది ఇండియానే అని అభిప్రాయపడ్డారు. మండలిలో రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఉండాలని.. ఒక్కటి ఉంటే సరిపోదని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 18న ‘ఇండో-పసిఫిక్’ అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా టోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సామర్థ్యంలో భారత్ మరో ‘చైనా’గా మారబోతోందని టోనీ అబోట్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా తర్వాత సూపర్‌పవర్‌గా ఎదగడానికి ప్రపంచదేశాలు భారత్‌కు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. భారత పర్యటన సందర్భంగా టోనీ అబోట్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్
ఎక్కడ : ఇండో-పసిఫిక్ సదస్సు, ఢిల్లీ
Published date : 19 Nov 2019 05:03PM

Photo Stories