ఐరాస నివేదిక ప్రకారం 2021–22లో భారత్ జీడీపీ వృద్ధి రేటు?
Sakshi Education
2021–22 ఆర్ధిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అంచనా వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఆర్థిక ఏడాదిలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని అంచనా
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్ (యూఎన్‌ఈఎస్‌సీఏపీ) నివేదిక
ఎందుకు : ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో
ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్ (యూఎన్‌ఈఎస్‌సీఏపీ) మార్చి 30న విడుదల చేసిన తన సర్వే ఆధారిత నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...
- కరోనా మహమ్మారి వల్ల 2020–21లో భారత ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణిస్తుంది. బేస్ ఎఫెక్ట్‌సహా ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో 2021–22లో వృద్ధి రేటు 7 శాతంగా ఉండే వీలుంది.
- వర్ధమాన ఆసియా–పసిఫిక్ దేశాల సగటు వృద్ధిరేటు 2021లో 5.9 శాతం ఉండే వీలుంది. 2022లో ఇది 5 శాతానికి తగ్గవచ్చు. 2020లో ఆయా దేశాల ఉత్పత్తి రేటు 1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.
- మహమ్మారి వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 8.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలో పడిపోయారు. వారు రోజుకు కేవలం 1.90 డాలర్లు (రూ.145కన్నా తక్కువ) సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఆర్థిక ఏడాదిలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని అంచనా
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్ (యూఎన్‌ఈఎస్‌సీఏపీ) నివేదిక
ఎందుకు : ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో
Published date : 31 Mar 2021 06:06PM