ఐపీఎస్ అధికారి ఆనందరాం కన్నుమూత
Sakshi Education
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కేసును ఛేదించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీనివాస ఆనందరాం (97) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1950లో సివిల్ సర్వీస్‌లో చేరిన ఆనందరాం 1978 -81 వరకు విశాఖ షిప్‌యార్డు సీఎండీగా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1982-83లో ఉమ్మడి ఏపీ డీజీపీగా సేవలందించారు.
ఆనందరాం 1984లో సీఐఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ హత్య కేసు విచారణకు ఏర్పాటు చేసిన ‘సిట్’కు నాయకత్వం వహించారు. 1975లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్న ఆయనను 1987లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. 994లో ‘అసాసినేషన్ ఆఫ్ ఏ ప్రైమినిస్టర్’ పుస్తకాన్ని ఆనందరాం రచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : శ్రీనివాస ఆనందరాం (97)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

Published date : 02 Nov 2019 06:14PM