ఐక్యరాజ్యసమితిలో గాంధీ స్టాంపు విడుదల
Sakshi Education
ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా రూపొందించిన మహాత్మాగాంధీ స్టాంపుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాసలో సెప్టెంబర్ 25న నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టాంపుని ఆవిష్కరించారు. సందర్భంగా ‘‘నాయకత్వ లక్షణాలు సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం’’అనే అంశంపై మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ మాట్లాడుతూ... అంటరాని వారు అంటూ సమాజం హేళన చేసిన వర్గాల్ని హరిజనులు, దేవుని పిల్లలంటూ గాంధీజీ అక్కున చేర్చుకున్న విధానం అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తుందని అన్నారు.
మరోవైపు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితికి భారత్ కానుకగా ఇచ్చిన సోలార్ పార్క్‌ను మోదీ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహాత్మాగాంధీ స్టాంపు విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఐక్యరాజ్యసమితి
మరోవైపు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితికి భారత్ కానుకగా ఇచ్చిన సోలార్ పార్క్‌ను మోదీ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహాత్మాగాంధీ స్టాంపు విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఐక్యరాజ్యసమితి
Published date : 26 Sep 2019 08:03PM