Skip to main content

ఐఎస్‌బీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

సన్న బియ్యం రకం తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు మార్కెటింగ్‌ కల్పించేందుకు వ్యవసాయ వర్సిటీలు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Education News
ఆగస్టు 14న వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందం జరిగింది. రైతులు ఎక్కువగా పండిస్తున్న సన్న బియ్యం రకం ‘తెలంగాణ సోనా’రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్శిటీ వైస్‌ చాన్స్లర్‌ వి.ప్రవీణ్‌రావు అభిప్రాయపడ్డారు.

లీ ఫార్మాకు సీడీఎస్‌సీఓ అనుమతి
హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసూటికల్‌ కంపెనీ లీ ఫార్మాకు ఫావిపిరావిర్‌ యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియెంట్‌ (ఏపీఐ) తయారీకి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) అనుమతి ఇచ్చింది. విశాఖపట్నంలోని స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్ (వీఎస్‌ఈజెడ్‌)లో ఫావిపిరావిర్‌ 200 ఎంజీట్యాబ్లెట్స్‌ను తయారు చేస్తామని కంపెనీ తెలిపింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.27గా ఉంటుందని డైరెక్టర్‌ రఘు మిత్ర చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు :సన్న బియ్యం రకం తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు మార్కెటింగ్‌ కల్పించేందుకు
Published date : 15 Aug 2020 10:32PM

Photo Stories