ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా రాకేశ్ భదౌరియా
Sakshi Education
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 26వ అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుత చీఫ్ బీఎస్ ధనోవా పదవీ విరమణ చేయడంతో భదౌరియా బాధ్యతలు స్వీకరించారు. 1980లో యుద్ధ విమాన పైలట్‌గా ఐఏఎఫ్‌లో ప్రవేశించిన భదౌరియా 40ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 26 రకాల యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆయనకు ఉంది. 2019, మే నెల నుంచి వైమానిక దళం వైస్ చీఫ్‌గా భదౌరియా పనిచేస్తున్నారు. భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియాను నియమించినట్లు సెప్టెంబర్ 19న కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 26వ అధిపతిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 26వ అధిపతిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా
Published date : 30 Sep 2019 05:56PM