Skip to main content

ఐదుగురు వెయిట్‌లిఫ్టర్లపై నాలుగేళ్ల నిషేధం

డోప్ పరీక్షల్లో విఫలమైనందుకు ఐదుగురు భారత వెయిట్‌లిఫర్లపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది.
ఈ ఐదుగురిలో కామన్వెల్త్ గేమ్స్(2010) మాజీ చాంపియన్ కత్తుల రవికుమార్, జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. ఒడిశాకు చెందిన రవికుమార్ ‘ఒస్టారిన్’ అనే నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు డోప్ పరీక్షల్లో తేలింది.

ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని చెప్పారు.కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఐదుగురు వెయిట్‌లిఫ్టర్లపై నాలుగేళ్ల నిషేధం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)
ఎందుకు : డోప్ పరీక్షల్లో విఫలమైనందుకు
Published date : 06 Nov 2019 06:15PM

Photo Stories