Skip to main content

ఐదు సెకన్లలో కరోనా నిర్ధారణ పరీక్ష

ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ కేవలం 5 సెకన్లలో కోవిడ్‌-19 ఉందో లేదో తెలిపే ఎక్స్‌ రే ఆధారిత నిర్థారణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
Current Affairs
సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కమల్‌ జైన్‌ దీనిని తయారు చేశారు. ఇందులో భాగంగా కోవిడ్‌ కేసులు సహా ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 వేల ఎక్స్‌రే స్కాన్లను డేటాబేస్‌ రూపంలో స్టోర్‌ చేసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో నడిచేలా తయారు చేసినట్లు చెప్పారు. దీనిని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలనకు పంపినట్లు తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 5 సెకన్లలో కోవిడ్‌-19 ఉందో లేదో తెలిపే ఎక్స్‌ రే ఆధారిత నిర్థారణ సాఫ్ట్‌వేర్‌ రూప‌క‌ల్పన‌
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ప్రొఫెసర్‌ కమల్‌ జైన్‌
Published date : 25 Apr 2020 06:10PM

Photo Stories