ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
Sakshi Education
వారసత్వ పరిరక్షణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి నిర్మలా తెలిపారు. 2020-21 బడ్జెట్ లో పర్యాటకరంగ అభివృద్ధికి రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు చరిత్రాత్మక ప్రాంతాల ఆధునీకీకరణ, అభివృద్ధి చేయనున్నామని వివరించారు.
కాలుష్య నియంత్రణకు రూ.4,400కోట్లు
వాతావరణ మార్పులను ఎదుర్కొవడం, పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉన్నామని నిర్మలా పేర్కొన్నారు. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. 10లక్షల జనాభా దాటిన నగరాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యత కష్టంగా మారింది. నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400కోట్లు కేటాయిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు.
ఐదు చరిత్రాత్మక ప్రాంతాలు
- హరియాణాలోని రాఖీగడ
- యూపీలోని హస్తినాపూర్ అభివృద్ధి
- అసోంలోని శివసాగర్
- గుజరాత్‌లోని ధోలావీర
- తమిళనాడులోని ఆదిత్య నల్లూరు అభివృద్ధి
కాలుష్య నియంత్రణకు రూ.4,400కోట్లు
వాతావరణ మార్పులను ఎదుర్కొవడం, పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉన్నామని నిర్మలా పేర్కొన్నారు. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. 10లక్షల జనాభా దాటిన నగరాల్లో స్వచ్ఛమైన గాలి లభ్యత కష్టంగా మారింది. నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400కోట్లు కేటాయిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు.
Published date : 01 Feb 2020 02:40PM