Skip to main content

ఐదు అంశాల్లో భారత్, చైనా ఏకాభిప్రాయం

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి.
Current Affairs

రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 11న జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఐదు అంశాలు...

  • సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ
  • సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం
  • వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం
  • రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం
  • సైనిక బలగాల మధ్య దూరం పాటించడం

రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష..
చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సెప్టెంబర్ 11న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : భారత్, చైనా
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించేందుకు
Published date : 12 Sep 2020 05:20PM

Photo Stories