Skip to main content

ఐడియా బ్యాంక్ మూసివేతకు ఆర్‌బీఐ ఆమోదం

ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మూసివేతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది.
స్వచ్ఛంద మూసివేత కోసం ఐడియా బ్యాంక్ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హైకోర్టు 2019, సెప్టెంబర్ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్ నియమించిందని వివరించింది. అయ్యర్ డెలాయిట్ టచ్ తొమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలో సీనియర్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. 2015 ఆగస్టులో ఆర్‌బీఐ మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకింగ్ కార్యకలాపాల లెసైన్స్ లను ఇచ్చింది.

నాలుగో కంపెనీ
పేమెంట్స్ బ్యాంకింగ్ రంగం నుంచి వైదొలగిన నాలుగో కంపెనీగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. గతంలో దిలిప్ సంఘ్వి, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ల కన్సార్షియంతో పాటు టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈ రంగం నుంచి వైదొలిగాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మూసివేతకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : స్వచ్ఛంద మూసివేత కోసం ఐడియా బ్యాంక్ దరఖాస్తు చేయడంతో
Published date : 19 Nov 2019 05:07PM

Photo Stories