ఆ ఐదెకరాల్లో మసీదు, ఆసుపత్రి: వక్ఫ్ బోర్డు
Sakshi Education
అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన ఐదెకరాల స్థలంలో మసీదు, ఆసుపత్రితో పాటు లైబ్రరీని నిర్మించనున్నట్లు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేటాయించనున్న ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మించాలని నిర్ణయించినట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూకీ ఫిబ్రవరి 24న వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించి త్వరలో ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. మసీదుకు పేరు పెట్టే అంశంపై ట్రస్ట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Published date : 25 Feb 2020 06:15PM