అహ్మదాబాద్‌లో స్వచ్ఛభారత్ దివస్
Sakshi Education
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదీతీరాన ‘స్వచ్ఛభారత్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా భారత్ నిలిచిందని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే ‘ఓడీఎఫ్ ఇండియా’ మ్యాప్‌ను ఆవిష్కరించారు.
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అహ్మదాబాద్‌లో స్వచ్ఛభారత్ దివస్
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
- ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరుగుతోంది. భారత ప్రతిష్ట ఏ స్థాయిలో పెరిగిందో అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో స్పష్టంగా తెలిసింది.
- ఈ రోజు గ్రామీణ భారతం, గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయి.
- 60 నెలల్లో 60 కోట్ల ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడంపై ప్రపంచం భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతోంది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగవద్దని, ఇంకా ముందుకు సాగాలి.
- పారిశుద్ధ్యం, ప్రకృతి పరిరక్షణ గాంధీజీకి ఎంతో ఇష్టమైన విషయాలు.
- 2022 నాటికి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నామరూపాలు లేకుండా చేయాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అహ్మదాబాద్‌లో స్వచ్ఛభారత్ దివస్
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా
Published date : 03 Oct 2019 05:41PM