Skip to main content

ఆహార రంగంలో కృషికి పురస్కారాలు: బెర్జ్‌ఫోర్స్

ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పరిష్కారాలు సూచించేవారికి ఒక్కొక్కటి 10 లక్షల డాలర్ల (సుమారు రూ.7 కోట్లు) వంతున రెండు పురస్కారాలు ఏటా అందజేస్తామని స్వీడన్‌కి చెందిన ‘కర్ట్ బెర్జ్‌ఫోర్స్ ఫౌండేషన్’ ఫిబ్రవరి 20న ప్రకటించింది.
Current Affairsప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సుస్థిర ఆహారానికి తగిన పరిష్కారం చెప్పేవారికి ఒకటి, ఆహార రంగాన్ని సమూలంగా మార్చేసే నవ్యావిష్కరణలకు ఒకటి చొప్పున 2020 ఏడాది నంచే పురస్కారాలను అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లు కాగా 2050 నాటికి 1000 కోట్లకు చేరుతుందని అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఆహార రంగంలో కృషికి పురస్కారాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : కర్ట్ బెర్జ్‌ఫోర్స్ ఫౌండేషన్
Published date : 21 Feb 2020 06:01PM

Photo Stories