ఆధార్ వినియోగ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం
Sakshi Education
ఆధార్ నంబర్‌ను గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా మొబైల్ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు స్వచ్చందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ మార్చి 3న ఆమోదం తెలిపారు.
మొబైల్ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ వినియోగాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆర్డినెన్స్ తో ఇకపై వీటికి ఆధార్‌ను వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, రాజ్యసభ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధార్ వినియోగ ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధార్ వినియోగ ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Published date : 04 Mar 2019 06:03PM