Skip to main content

అడ్వాన్స్‌డ్‌ చాఫ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ?

శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు ‘అడ్వాన్స్‌డ్‌ చాఫ్‌ టెక్నాలజీ’ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
Current Affairs
డీఆర్‌డీవోకి చెందిన ‘డిఫెన్స్‌ లాబొరేటరీ జోధ్‌పూర్‌’(డీఎల్‌జే) ఈ కీలక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివద్ధి చేసి షార్ట్‌ రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎస్‌ఆర్‌సీఆర్‌), మీడియం రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎంఆర్‌సీఆర్‌), లాంగ్‌ రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎల్‌ఆర్‌సీఆర్‌) అనే మూడు రకాల రాకెట్లను రూపొందించింది. నౌకాదళ గుణాత్మక అవసరాలను తీర్చేలా వీటిని డీఎల్‌జే తీర్చిదిద్దింది. ఈ మూడు విభాగాల రాకెట్లను భారత నౌకాదళం ఇటీవల అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది.

శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత క్షిపణుల నుంచి రక్షణ నౌకలను రక్షించేందుకు చాఫ్‌ పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా శత్రువుల భవిష్యత్‌ దాడులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని డీఆర్‌డీవో సాధించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అడ్వాన్స్‌డ్‌ చాఫ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 5
ఎవరు : డీఆర్‌డీవోకి చెందిన ‘డిఫెన్స్‌ లాబొరేటరీ జోధ్‌పూర్‌’(డీఎల్‌జే)
ఎందుకు : దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు
Published date : 06 Apr 2021 06:20PM

Photo Stories