అడ్రియాటిక్ పెర్ల్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు
Sakshi Education
అడ్రియాటిక్ పెర్ల్ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
మాంటెనిగ్రోలోని బద్వా పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో ఫిబ్రవరి 21న వింకా (60 కేజీలు), సనమచ చాను (75 కేజీలు) భారత్‌కు బంగారు పతకాలు అందించారు. ఫైనల్లో వింకా 5–0తో క్రిస్టినా క్రిపెర్ (మాల్డోవా)పై... సనమచ చాను 6–0తో రాజ్ సాహిబా (భారత్)పై గెలిచారు.
రజతం, కాంస్యం...
48 కేజీల విభాగంలో గీతిక(భారత్) రజతం సాధించింది. ఫైనల్లో గీతిక 1–4తో ఫర్జానా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. 57 కేజీల సెమీఫైనల్లో ప్రీతి(భారత్) 1–4తో బొజానా (మాంటెనిగ్రో) చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
మాంటినిగ్రో రాజధాని: పొడ్గారికా; కరెన్సీ: యూరో
మాంటినిగ్రో ప్రస్తుత అధ్యక్షుడు: మిలో డ్యుకనోవిక్
మాంటినిగ్రో ప్రస్తుత ప్రధాని: జ్‌రావ్‌కో క్రివోకపిక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడ్రియాటిక్ పెర్ల్ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : వింకా (60 కేజీలు), సనమచ చాను (75 కేజీలు)
ఎక్కడ : బద్వా, మాంటెనిగ్రో

Published date : 25 Feb 2021 03:20PM