అదనపు రుణాలను సమీకరించుకొనేందుకు అనుమతి పొందిన రాష్ట్రాలు?
ఈ మేరకు డిసెంబర్ 20న కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం తాజా అనుమతితో... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కలిపి మొత్తంగా రూ. 16,278 కోట్లను అదనపు రుణాలు సేకరించుకొవచ్చు. ఇందులో తెలంగాణ రూ. 2,508 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 2,525 కోట్లు బహిరంగ మార్కెట్ ద్వారా సమీకరించుకొవచ్చు.
జీఎస్‌డీపీలో రెండు శాతం...
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు అదనపు నిధుల అవసరాలను తీర్చుకొనేందుకు వీలుగా రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్‌డీపీలో రెండు శాతం మేర(ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితి మూడు శాతం మించి) పెంచాలని కేంద్రం 2020, మే నెలలో నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అదనపు రుణాలు సమీకరించుకొనేందుకు అర్హత సాధించాలంటే 2021 ఫిబ్రవరి 15లోగా నాలుగు రకాల సంస్కరణలను అమలు చేయాలని షరతు విధించింది.
నాలుగు రకాల సంస్కరణలు
- ఒక దేశం-ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయాలి.
- సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టాలి.