ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు
Sakshi Education
2020-21 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు చేసింది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంది. కార్పొరేట్ ట్యాక్స్‌ను 15శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా కటించారు.
కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు
ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడులకు ఎన్‌ఆర్‌ఐలకు అవకాశం
నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు
- రూ. 5 లక్షల వార్షికాదాయంపై పన్ను లేదు
- రూ. 5-7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
- రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు
- రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను
- రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను
- రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను
కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు
- కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు
- కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు
- కార్పొరేట్ ట్యాక్స్‌లు తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయం
- డివిడెండ్ డిస్ర్టిబ్యూషన్ ట్యాక్స్ రద్దు
- బ్యాంకింగ్ రంగంలో మరింత పారదర్శకత రావాల్సిన అవసరముంది
- చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు
- ఫైనాన్షియల్ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం
ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడులకు ఎన్‌ఆర్‌ఐలకు అవకాశం
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5లక్షల కోట్ల మూలధనసాయం.
- డిపాజిట్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు.
- కంపెనీ చట్టంలో మార్పులు. బ్యాంకింగేతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు అదనపు నిధుల కేటాయింపునకు కొత్త పథకం.
- ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడులకు ఎన్‌ఆర్‌ఐలకు అవకాశం.
- ఆర్థిక ఒప్పందాల పర్యవేక్షణకు కొత్తం చట్టం.
- మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు
Published date : 01 Feb 2020 02:45PM