అదానీకి ఐదు విమానాశ్రయాలు నిర్వహణ
Sakshi Education
ప్రైవేట్ రంగ సంస్థ అదానీ గ్రూప్ అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది.
ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల పాటు వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చిన బిడ్స్ లో అయిదింటికి అదానీ అత్యధికంగా కోట్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఫిబ్రవరి 25న తెలిపింది. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు వీటిలో ఉన్నట్లు పేర్కొంది. ఆరోదైన గౌహతి ఎయిర్‌పోర్ట్ బిడ్‌ను ఫిబ్రవరి 26న తెరవనున్నారు.
ఏఏఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు అదానీ గ్రూప్ ప్యాసింజర్ ఫీజు కింద అత్యధికంగా రూ. 177 ఆఫర్ చేసింది. అలాగే జైపూర్‌కు రూ. 174, లక్నో ఎయిర్‌పోర్టుకు రూ. 171, తిరువనంతపురం విమానాశ్రయానికి రూ. 168, మంగళూరు ఎయిర్‌పోర్టుకు రూ. 115 మేర ప్యాసింజర్ ఫీజు కింద ఏఏఐకి అదానీ గ్రూప్ చెల్లించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన ఏఏఐ అధీనంలోని ఆరు విమానాశ్రయాలను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్రం 2018, నవంబర్‌లో ఆమోదముద్ర వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టు
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : అదానీ గ్రూప్
ఎక్కడ : అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు

Published date : 26 Feb 2019 05:33PM