93వ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన భారతీయ చిత్రం?
Sakshi Education
2021, ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ నామినేట్ అయ్యింది.
జల్లికట్టును ఆస్కార్ ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నవంబర్ 25 ప్రకటించింది.
జల్లికట్టు గురించి...
- లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’.
- ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
- కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం.
- 2019, అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లకు మంచి పేరు లభించింది.
- 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో.
చదవండి: 92వ ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా?92వ ఆస్కార్ అవార్డులు-విజేతలు;
Published date : 28 Nov 2020 06:02PM