90 నగరాల్లో వాయు కాలుష్యం తగ్గుదల: ఎస్‌ఏఎఫ్‌ఏఆర్
Sakshi Education
దేశవ్యాప్తంగా 90 నగరాల్లో వాయు కాలుష్యం చాలా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఏఎఫ్‌ఏఆర్) సంస్థ వెల్లడించింది.
సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా తగ్గినట్టుగా ఎస్‌ఏఎఫ్‌ఏఆర్ సైంటిస్టు గుఫ్రాన్ బీగ్ మార్చి 29న తెలిపారు. ఎస్‌ఏఎఫ్‌ఏఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో పీఎం 2.5 (గాలిలో సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు) 30 శాతం వరకు తగ్గితే, అహ్మదాబాద్ పుణేలలో 15 శాతం వరకు తగ్గాయి. కోవిడ్-19 కారణంగా దేశం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో వాహనాల రణగొణధ్వనులు లేవు పరిశ్రమలు తాత్కాలికంగా మూతబడ్డాయి. దీంతో వాయి కాలుష్యం తగ్గింది.
Published date : 30 Mar 2020 06:59PM