6 అపాచీ, 24 రోమియో హెలికాప్టర్ల కొనుగోలు
Sakshi Education
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 25న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి.
చర్చల్లో మోదీ, ట్రంప్ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి.
మోదీతో చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, 260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. సముద్రం అడుగున దాగున్న జలాంతర్గాములను సైతం గుర్తించి దాడి చేయగలగడం రోమియో సత్తా కాగా.. లేజర్ల పర్యవేక్షణలో గుళ్ల వర్షం కురిపించగలగడం అపాచీ ప్రత్యేకత.
అపాచీ ఏహెచ్-64ఈ విశేషాలు
ఎంహెచ్60 రోమియో విశేషాలు

- తయారీ సంస్థ: బోయింగ్ సంస్థ
- ప్రయాణించగలిగే సిబ్బంది సంఖ్య: 2
- పొడవు: 17.7 మీటర్లు; ఎత్తు: 5 మీటర్లు; రోటర్ వ్యాసం: 14.6
- ఒట్టి హెలికాప్టర్ బరువు: 5170 కిలోలు
- ఆయుధాలన్నీ ఎక్కించిన తరువాత బరువు: 10,439 కిలోలు
- నిలువుగా పైకి ఎగబాకే వేగం నిమిషానికి: 2,000 అడుగులు
- ఇంజిన్ల సంఖ్య: 2 (జనరల్ ఎలక్ట్రిక్ టీ-700 టర్బోషాఫ్ట్)
- గరిష్ట వేగం: 284 కి.మీ
- ఆయుధ సంపత్తి: 30 మిల్లీమీటర్ల ఫిరంగి గుళ్లు (1200 రౌండ్లు)
- క్షిపణుల్లో రకాలు : 16 ట్యాంకు విధ్వంసక క్షిపణులు
- ఏఐఎం 92 స్ట్రింగర్ మిస్ట్రాల్, క్షిపణులు నాలుగు చొప్పున బిగించుకోవచ్చు. లేదంటే రెండు ఏఐఎం-9 సైడ్ విండర్ క్షిపణులు ఉపయోగించుకోవచ్చు.
- ఏజీఎం-122 సైడ్ ఆర్మ్ యాంటీ రేడియేషన్ క్షిపణులు రెండు చొప్పున ఏర్పాటు చేసుకోవచ్చు. లేజర్లు, పరారుణ కాంతుల సాయంతో లక్ష్యాలను గుర్తించవచ్చు. ఏ లక్ష్యాలపై గురిపెట్టాలో కూడా నిర్ణయించవచ్చు.
ఎంహెచ్60 రోమియో విశేషాలు
- తయారీ సంస్థ: లాక్‌హీడ్ మార్టిన్
- పరిధి: 834 కి.మీ
- ఎత్తు: 5.1 మీటర్ల్లు; పొడవు: 19.76 మీటర్లు; వెడల్పు: 16.35 మీటర్లు
- పైకి ఎగబాక గలిగే వేగం సెకనుకు: 8.38 మీటర్లు
- బరువు దాదాపుగా: 10,350 కిలోలు
- జలాంతర్గాములను గుర్తించగలదు వెతుకులాట, రక్షణ వంటి కార్యకలాపాలకూ వాడుకోవచ్చు.
- అత్యాధునిక యుద్ధ వ్యవస్థలన్నీ దీని సొంతం. ఒక్కసారి నింగికి ఎగిరితే 3.30 గంటల సమయం యుద్ధంలో పాల్గొనగలదు.
- ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తే...భారత నావికాదళంలోని వెస్ట్‌ల్యాండ్ సీకింగ్ హెలికాప్టర్లు (బ్రిటన్ తయారీ)ల వాడకం ఆగిపోతుంది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న సీ కింగ్ నిర్వహణ వ్యయం తడిసి మోపెడు అవుతూండటం దీనికి ఒక కారణం.
Published date : 28 Feb 2020 12:50PM