Skip to main content

5వ ఈఈఎఫ్ ప్లీనరీలో ప్రధాని మోదీ

రష్యాలోని వ్లాడివోస్టోక్‌లో జరుగుతున్న 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం(ఈఈఎఫ్) ప్లీనరీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 5న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్-రష్యాల, వ్యూహాత్మకమైన ఇంధనం, రక్షణ రంగాలు, ఇరుదేశాల బంధంపై ఉండబోదన్నారు. రష్యా తూర్పు ప్రాంత(ఫార్ ఈస్ట్) అభివృద్ధికి రూ.7వేల కోట్లను భారత్ రుణంగా అందజేయనుందని ప్రకటించారు. ఈఈఎఫ్ వేదికగా రూ.36 వేల కోట్ల విలువైన 50 ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. అనంతరం మోదీ ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ విధానాన్ని ఆవిష్కరించారు.

వినియోగం, తిరిగి చెల్లింపులు, వడ్డీల విషయంలో సులభతర నిబంధనలు ఉండే లైన్ ఆఫ్ కెడ్రిట్ రూపంలో రష్యాకు భారత్ రుణాన్ని మంజూరు చేయనుంది. మరోవైపు మలేసియా ప్రధాని మహాతిర్ మహహ్మద్, జపాన్ ప్రధాని షింజో అబే, మంగోలియా అధ్యక్షుడు ఖాల్త్‌మాగీన్ మట్లుగ్లాతో మోదీ వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం(ఈఈఎఫ్) ప్లీనరీ
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వ్లాడివోస్టోక్, రష్యా
Published date : 06 Sep 2019 05:30PM

Photo Stories