Skip to main content

57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ సాగర తీరంలోని వుడా పార్క్ రింక్‌లో ఏర్పాటు చేసిన 57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ డిసెంబర్ 19న ప్రారంభించారు.
Current Affairsఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న స్కేటర్లను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ క్రమశిక్షణ అనేది క్రీడల ద్వారా వస్తుందన్నారు. జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత యువత చేతుల్లోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పోలీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్
విశాఖ వేదికగా 20వ ఆలిండియా పోలీస్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను గవర్నర్ విశ్వభూషణ్ డిసెంబర్ 19 ప్రారంభించారు. దేశంలోని 18 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
57వ నేషనల్ రోలర్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 20 Dec 2019 05:58PM

Photo Stories