Skip to main content

51వ దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన నటుడు?

దిగ్గజ నటుడు రజనీ కాంత్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగంలో ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి... రజనీని ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1న తెలిపింది.
Current Affairs ఫాల్కే అవార్డు దక్కిన 51వ సినీ ప్రముఖుడు రజనీకాంత్‌. 2019వ సంవత్సరానికి గాను రజనీకి ఈ అవార్డు ప్రకటించారు. గతంలో తమిళంలో హీరో శివాజీ గణేశన్‌ (1996), దర్శక – నిర్మాత కె. బాలచందర్‌ (2000)లకు కూడా ఫాల్కే అవార్డు దక్కింది. వారి తర్వాత ఆ అవార్డు సాధించిన మూడో తమిళ సినీ ప్రముఖుడిగా రజనీ గుర్తింపు పొందారు.

దాదా సాహెబ్‌ ఫాల్కే...
దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాలో అత్యున్నత పురస్కారం. భారతీయ సినిమా పురోగతికీ, అభివృద్ధికీ అందించిన అత్యున్నతసేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తోంది. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు.

ఏడుగురు తెలుగు వారికి...
ఇప్పటి దాకా ఏడుగురు తెలుగు వారికి ఫాల్కే అవార్డు దక్కింది. తెలుగువారైన బి.ఎన్‌. రెడ్డి, పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని, రామానాయుడు, కె. విశ్వనాథ్‌లు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.

క్విక్ ‌ రివ్యూ :
ఏమిటి : 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికై నటుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 1
ఎవరు : రజనీ కాంత్‌
ఎందుకు : భారతీయ సినిమా పురోగతికీ, అభివృద్ధికీ అందించిన అత్యున్నతసేవలకు గుర్తింపుగా
Published date : 02 Apr 2021 06:42PM

Photo Stories