Skip to main content

50వ గవర్నర్ల వార్షిక సమావేశం ప్రారంభం

దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నవంబర్ 23న 50వ గవర్నర్ల వార్షిక సమావేశం ప్రారంభమైంది.
Current Affairsఈ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రపతి మాట్లాడుతూ... గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల పాత్ర కేవలం రాజ్యాంగ పరిరక్షణకు మాత్రమే పరిమితం కారాదని, ప్రజా జీవితంలో వీరికున్న అపార అనుభవం ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. గవర్నర్లు ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, సమాజంలో వెనుకబడ్డ తరగతులు, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
50వ గవర్నర్ల వార్షిక సమావేశం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ
Published date : 25 Nov 2019 05:44PM

Photo Stories